సుధీర్ బాబు హీరోగా నటించిన సినిమా 'మామా మశ్చీంద్ర'. ఈ సినిమాకి హర్షవర్ధన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సుధీర్ బాబు మూడు విభిన్న పాత్రలలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి ఊబకాయం ఉన్న దుర్గ, ఓల్డ్ డాన్ పరశురామ్ క్యారెక్టర్ పోస్టర్‌లు రిలీజ్ చేసారు. తాజాగా ఈ సినిమా నుండి డిజె క్యారెక్టర్ పోస్టర్‌ను రిలీజ్ చేసారు చిత్రబృందం. ఈ సినిమాకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పిపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు.