యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం "దాస్ కా ధమ్కీ" తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుందని తెలుస్తుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు యూ/ ఏ సెర్టిఫికెట్ ఇచ్చిందని తెలుస్తుంది. మరి, ఈ నెల మార్చి 22న విడుదల కాబోతుందని కూడా సమాచారం అందుతుంది. మరి, ఈ విషయాలపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావలసి ఉంది.
నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రావు రమేష్, రోహిణి కీరోల్స్ లో నటిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటుగా తమిళం, మలయాళం, హిందీ భాషలలో కూడా విడుదల కాబోతుంది.