మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ ప్రస్తుతం USA లో ఉన్న విషయం తెలిసిందే. RRR ఆస్కార్ ప్రమోషన్స్ నిమిత్తం గత నెల్లో USA కి బయలుదేరి వెళ్లిన చరణ్, అక్కడ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఐతే, లేటెస్ట్ గా ఉపాసన కూడా USA లో ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఒకపక్క ఇంటర్వ్యూలు, టాక్ షోలు, మీడియా ఇంటిరాక్షన్లలో పాల్గొంటూనే భార్య ఉపాసనతో క్వాలిటీ టైం ను చరణ్ గడుపుతున్నారు. ఈ మేరకు ఉపాసన తాజాగా చేసిన సోషల్ మీడియా పోస్ట్ ను చూస్తే, ఈ కపుల్ అక్కడ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో అర్థం అవుతుంది. విశేషమేంటంటే, RRR ఆస్కార్ ప్రమోషన్స్ నిమిత్తం రాంచరణ్ వెళ్లిన USA ట్రిప్ తాజాగా ఉపాసన బేబీ మూన్ ట్రిప్ గా కూడా మారిపోయింది. డిసెంబర్ 12న ఉపాసన, చరణ్ లు అతి త్వరలోనే తమ మొదటి సంతానాన్ని ఎత్తుకోబోతున్నారు... అంటూ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ జరిగిన విషయం తెలిసిందే.