షణ్ముఖ్ ప్రశాంత్ దర్శకత్వంలో సుహాస్, టీనా శిల్పరాజ్ జంటగా నటించిన చిత్రం "రైటర్ పద్మభూషణ్". ఈ సినిమాలో రోహిణి, ఆశిష్ విద్యార్ధి కీరోల్స్ లో నటించారు. ఫన్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాను చాయ్ బిస్కట్, లహరి ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
ఫిబ్రవరి 3వ తేదీన విడుదలైన "రైటర్ పద్మభూషణ్" మూవీ కి ఆడియన్స్, క్రిటిక్స్ నుండి సూపర్ పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లను రాబడుతూ, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. పోతే, ఉగాది కానుకగా ఇప్పుడు ఈ సినిమా ఓటిటిలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ మేరకు ఈ నెల 17 నుండి ఎర్లీ ఉగాది కానుకగా జీ 5 ఓటిటిలో రైటర్ పద్మభూషణ్ మూవీ డిజిటల్ ప్రీమియర్ కాబోతుంది.. అంటూ అధికారిక ప్రకటన వచ్చింది.
![]() |
![]() |