సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా గతేడాదిలోనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించగా, తారకరత్న మరణం కారణంగా ఈ నెలలో మొదలు కావాల్సిన న్యూ షెడ్యూల్ వాయిదా పడిందన్న విషయం తెలిసిందే. శ్రీలీల కీరోల్ లో నటిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్ సంస్థ నిర్మిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, మార్చి 9 నుండి అంటే రేపటి నుండి మొదలు కాబోయే NBK 108 న్యూ షెడ్యూల్ లో యంగ్ సెన్సేషన్ శ్రీలీల పాల్గొనబోతుందని తెలుస్తుంది. మూడు రోజుల పాటు శ్రీలీలపై మేకర్స్ కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.