ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మండన్నా జంటగా నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ "పుష్ప 2". ఈ సినిమాలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి నటించబోతుందని, ఈ నెల్లోనే షూట్ లో కూడా పాల్గొంటుందని, కేవలం 10 రోజులు మాత్రమే సాయి పల్లవి ఈ మూవీ షూట్ లో పాల్గొంటుందని ఈ రోజు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న న్యూస్. తాజాగా ఇప్పుడు ఈ న్యూస్ పై వినిపిస్తున్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, సాయి పల్లవి ఈ సినిమాలో నటించట్లేదని తెలుస్తుంది. ఐతే, ఆమె నటించబోయే అవకాశం మాత్రం ఉందని తెలుస్తుంది. రష్మిక మండన్నా కాకుండా మరొక హీరోయిన్ రోల్ కూడా పార్ట్ 2 లో ఉంటుందని, ఐతే, ఆ పాత్ర కోసం ఇంకా మేకర్స్ ఎవరినీ ఎంచుకోలేదని, కేవలం సంప్రదింపుల్లో మాత్రమే ఉన్నారని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa