టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కలిసి నటిస్తున్న చిత్రం "మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి". యూవీ క్రియేషన్స్ నిర్మాణసారధ్యంలో చాలా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా హీరోయిన్ అనుష్కకు 48వ సినిమా. వేసవి కానుకగా ఈ సినిమా విడుదల కాబోతుంది.
ఈ రోజు ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుండి మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు. విదేశీ వీధుల్లో తెల్లవాళ్ళ మధ్య ఎంతో సంతోషంగా కలియ తిరుగుతున్న అనుష్కను ఈ పోస్టర్ లో మనం చూడవచ్చు.
పి మహేష్ బాబు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. రధన్ సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థలో ప్రొడక్షన్ నెంబర్ 14 గా ఈ సినిమా తెరకెక్కుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa