మూవీ మావెరిక్ శంకర్ దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా RC 15. ఇంకా టైటిల్ ఖరారు కాబడని ఈ సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. మరి, చరణ్ బర్త్ డే (మార్చి 27)దగ్గరకు వచ్చేస్తుంది. మేకర్స్ నుండి RC 15 కి సంబంధించిన అప్డేట్స్ ని చాలా బలంగా కోరుకుంటున్నారు మెగా ఫ్యాన్స్.
ఈ నేపథ్యంలో తాజాగా RC 15 టైటిల్ ఇదేనంటూ .. సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఆ టైటిల్ ఏంటంటే.. సీఈఓ (చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్) అని, ఇందులో CEO రామ్ నందన్ గా చెర్రీ నటిస్తున్నారని టాక్. అదీకాక పాన్ ఇండియా భాషల్లో ఒకే టైటిల్ ని ఫిక్స్ చెయ్యాలని కూడా మేకర్స్ నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది.