ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఉన్న దిగ్గజ దర్శకుల్లో AR మురుగదాస్ ఒకరు. ఆయన నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ "ఆగస్టు 16,1947". గౌతమ్ కార్తీక్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా, కొత్తమ్మాయి రేవతి హీరోయిన్ గా నటిస్తుంది.
తాజాగా మేకర్స్ మూవీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేస్తూ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు. ఈ మేరకు ఆగస్టు 16, 1947 మూవీ పాన్ ఇండియా భాషలతో పాటుగా ఇంగ్లిష్ లో కూడా వచ్చే నెల 7న విడుదల కాబోతుందని తెలుస్తుంది.
NS పొన్ కుమార్ ఈ సినిమాకు దర్శకుడు కాగా, AR మురుగదాస్ తో కలిసి ఓం ప్రకాష్ భట్, నర్సీరామ్ చౌదరీ నిర్మిస్తున్నారు.