దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కిన "బలగం" మూవీ గత శుక్రవారం థియేటర్లలో విడుదలై, ఆడియన్స్, క్రిటిక్స్ నుండి పాజిటివ్ రివ్యూలు అందుకుంటుంది. కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఈ సినిమా విడుదలకు ముందే పెట్టుబడిని తీసుకొచ్చేసింది. అయినా మౌత్ టాక్ చాలా బాగుండడంతో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మ్యాజికల్ కలెక్షన్లను రాబడుతుంది. మేకర్స్ ఎనౌన్స్ చేసినదాని ప్రకారం, సినిమా విడుదలైన ఐదో రోజు అంటే నిన్న ఎక్కువ గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని తెలుస్తుంది. అంటే, బలగం సినిమాకు ఆడియన్స్ నుండి ఎంతటి భీకర రెస్పాన్స్ వస్తుందో అర్థం అవుతుంది. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందించారు. హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు.