శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నటించిన సినిమా "ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి". ఈ సినిమాకు కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి మూడవ పాటను విడుదల చేసేందుకు మేకర్స్ ముహూర్తం ఖరారు చేసారు. ఈ మేరకు రేపు సాయంత్రం ఆరు గంటలకు 'నీతో ఈ గడిచిన కాలం' అనే మెలోడీ సాంగ్ విడుదల కాబోతుందని తెలుస్తుంది.
ఈ సినిమా మార్చి 17న విడుదల కాబోతుంది.