కోలీవుడ్ హీరో, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్న చిత్రం "బిచ్చగాడు 2". ఈ సినిమాకు ఆయనే బాణీలు కూడా సమకూరుస్తున్నారు. ఈ మధ్యనే ఒక పెద్ద ప్రమాదం నుండి క్షేమంగా బయటపడిన విజయ్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా యొక్క ఆడియో రైట్స్ ని ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సరిగమ సౌత్ సంస్థ సొంతం చేసుకుంది. పోతే, ఈ సినిమా ఏప్రిల్ 14, 2023లో విడుదల కాబోతుంది.