ఇండస్ట్రీలో రీ రిలీజ్ లు, రీమేక్ ల ట్రెండ్ బాగా నడుస్తుంది. రీమేక్ ల ట్రెండ్ లో భాగంగా మన టాలీవుడ్ దర్శకనిర్మాతలు మలయాళ చిత్రాలవైపే ప్రధానంగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చినవే..భీమ్లానాయక్, గాడ్ ఫాదర్, బుట్టబొమ్మ, శేఖర్. ఇప్పుడు ఈ లిస్ట్ లో మరొక న్యూ మూవీ చేరబోతుందని తెలుస్తుంది.
2019లో హృదయం అనే సినిమా మలయాళ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్ లాల్, కళ్యాణి ప్రియదర్శన్, దర్శన ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను ప్రముఖ టాలీవుడ్ నిర్మాణసంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ తెలుగులో రీమేక్ చెయ్యాలని చూస్తుందట. రీసెంట్గానే బుట్టబొమ్మ (మలయాళం రీమేక్ 'కప్పేల') ను తెరకెక్కించిన ఈ నిర్మాణ సంస్థ ఇప్పుడు మరొక రీమేక్ కి సిద్ధం కావడం.. ఆసక్తిని సంతరించుకుంటుంది.