ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా ప్రఖ్యాతి గాంచిన ప్రభుదేవా మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ RC 15 కోసం పని చెయ్యబోతున్నారని తాజాగా అందుతున్న సమాచారం. మూవీ మావెరిక్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.
ఐతే, శంకర్ సినిమాలలో ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకర్షించేది పాటలు. పాటలను కూడా గ్రాండ్ మ్యానర్లో, వాటి గురించే ప్రత్యేకంగా మాట్లాడుకునేటట్టు చెయ్యడం శంకర్ నైజం. ఇప్పుడు ఆయన డైరెక్షన్లో రూపొందుతున్న RC 15 లో ఒక పాటను లావిష్ స్కేల్ పై తన మార్క్ స్టయిల్ లో చిత్రీకరించాలని శంకర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ చెయ్యబోతున్నారట. దీంతో , చెర్రీ, కియారాలపై ఈనెల 18 నుండి చిత్రీకరించబోయే పాటపై ఆడియన్స్ లో ఇప్పటినుండే అంచనాలు మొదలయ్యాయి.