మెగాపవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం అమెరికాలో, RRR ఆస్కార్ ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక పక్క ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొంటూనే, మరోపక్క భార్య ఉపాసనతో బేబీ మూన్ ని కూడా చరణ్ ఈ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్నారు.
RRR ఆస్కార్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ రోజు చరణ్ ఫేమస్ టాక్ ఈజీ పాడ్ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గొప్ప సినిమాలను ఆదరించే అన్ని దేశాలలో తనకు సినిమాలు చెయ్యాలని ఉందని పేర్కొన్నారు. అలానే తన హాలీవుడ్ డిబట్ కి సంబంధించి రాబోయే రెండు నెలల్లో అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రావొచ్చని, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. దీంతో మెగా అభిమానుల్లో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. అలానే తనకు జూలియా రాబర్ట్స్ తో పనిచెయ్యాలని ఉందని, ఫుల్ లెంగ్త్ లో కాకపోయినా, కనీసం గెస్ట్ రోల్ లో నటించడానికైనా నేను రెడీ.. అంటూ రాంచరణ్ తెలిపారు.