2022 మలయాళంలో మొదటి సూపర్ హిట్ చిత్రంగా "హృదయం" పేరు సాదించుకుంది. వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వంలో ప్రణవ్ మోహన్‌లాల్ అండ్ కళ్యాణి ప్రియదర్శన్ నటించిన హృదయం థియేటర్లలో అండ్ OTTలో భారీ విజయాన్ని సాధించింది. తాజాగా ఇప్పుడు, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగులో రీమేక్ చేయడానికి హృదయం రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధాన నటీనటులు, దర్శకుడు మరియు ఇతరుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.