సీనియర్ నటుడు మోహన్ బాబు, హీరోయిన్ మంచు లక్ష్మి ఫస్ట్ టైం కలిసి నటిస్తున్న చిత్రం "అగ్ని నక్షత్రం". తాజాగా ఈ సినిమా నుండి తెలుసా తెలుసా ...మా మనసుకున్నవి రెక్కలు.. అనే వీడియో సాంగ్ విడుదలయ్యింది. ఈ వీడియో సాంగ్ ని క్రేజీ హీరోయిన్ సమంత విడుదల చేసింది. కాసర్ల శ్యామ్ ఈ పాటకు లిరిక్స్ అందించగా, సింగర్స్ సునీత సారథి, శిరీష భాగవతుల, అదితి భావరాజు పాడారు.
వంశీ కృష్ణ మళ్ల దర్శకత్వంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మంచు లక్ష్మి పోలీసాఫీసర్ గా నటిస్తున్నారు. అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు.