ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమిళంలో విడుదలైన 'చమ్కీల అంగీలేసి'

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 09, 2023, 08:42 PM

నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ "దసరా" నుండి నిన్న విడుదలైన థర్డ్ సింగిల్ 'చెమ్కీల అంగీలేసి' ఫోక్ సాంగ్ కి శ్రోతల నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తున్న విషయం తెలిసిందే. నిన్న తెలుగుతో పాటుగా, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైన ఈ పాట తాజాగా ఈ రోజు తమిళ భాషలో విడుదలయ్యింది. తమిళంలో ఈ పాటను రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్, ధీ కలిసి పాడారు. ముతమిల్ సాహిత్యం అందించారు. సంతోష్ నారాయణ్ స్వరపరిచారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈనెల 30న విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa