ఎప్పుడూ బిజీ షెడ్యూల్స్ మధ్య నలిగిపోతుంటారు హీరోయిన్లు. దాంతో ఒత్తిడి ఎక్కువై స్ట్రెస్ తలకెక్కే లోపు.. చిల్ అవ్వడానికి ఉపాయాలు కూడా ఆలోచిస్తుంటారు. ఈక్రమంలో వారికి ఉన్న ఏకైక ఉపశమనం.. ఇష్టమైన ప్రాంతాన్ని ఎంచుకుని హ్యాపీగా ఓ టూర్ వేయడమే. ప్రస్తుతం హీరోయిన్ రాశీ ఖన్నా అదే పని చేస్తోంది. పారిస్ అందాల నడుమ చిల్ అవుతోంది రాశీ ఖన్నా. అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తోంది. ఉరకలువేసు మనసును కంట్రోల్ చేసుకుంటూ ఈలోకాన్ని మర్చిపోయి మరీ.. ఆనందిస్తుంది, ఆస్వాదిస్తోంది. పారిస్ లో తన టూర్ కు సబంధించిన ఫోటోస్ ను రాశీ ఖన్నా ఇన్ స్టాలో శేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కూల్ గా.. లైట్ కలర్ డ్రెస్ వేసుకుని, అక్కడి ప్రకృతిలో పులకరించి.. పరవశించిపోతోంది రాశీ. కూల్ పారిస్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. పనిలో పనిగా.. అక్కడి ఐఫిల్ టవర్ తో ఓ ఫోటో దిగి పోస్ట్ చేసింది. అక్కడి వీధుల్లో షికారు చేస్తూ.. సెలబ్రిటీ అన్న విషయం పక్కన పెట్టి, కామన్ ఉమెన్ లా తెగ తిరిగేసింది.
Ravishing beauty Raashii Khanna enjoying her vacation in Paris#RaashiiKhanna #RaashiKhanna #Thursday #thursdaymood #YouWeMedia pic.twitter.com/LniR2rTLfu
— YouWe Media (@MediaYouwe) March 9, 2023
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa