రియల్ స్టార్ ఉపేంద్ర, బాద్షా కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం "కబ్జా". ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సెన్సేషన్ సృష్టించిన ఈ సినిమా మార్చి 17వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, కబ్జా తెలుగు వెర్షన్ ని USA లో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ సంస్థ గ్రాండ్ రిలీజ్ చెయ్యబోతుందని తెలుస్తుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన జరిగింది. పోతే, కబ్జా USA ప్రీమియర్స్ మార్చి 16 నుండి జరగనున్నాయి. కారునాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ స్పెషల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాకు R. చంద్రు డైరెక్టర్. రవి బసృర్ మ్యూజిక్ డైరెక్టర్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa