ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'తూ ఝూఠీ మై మక్కార్' 2రోజుల కలెక్షన్లు

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 10, 2023, 07:13 PM

బాలీవుడ్ లవర్ బాయ్ రణ్ బీర్ కపూర్, డ్రీం గర్ల్ శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం "తూ ఝూఠీ మై మక్కార్". రణ్ బీర్ - శ్రద్ధ కాంబోలో తెరకెక్కిన ఫస్ట్ మూవీ ఇదే. లవ్ రంజన్ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాను లవ్ ఫిలిమ్స్, టి సిరీస్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది.


బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుండి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా హౌస్ ఫుల్ థియేటర్ రన్ జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు 15.73 కోట్లు, గురువారం అంటే రెండో రోజు 10.34 కోట్లు మొత్తంగా, రెండు రోజుల్లో 26.07 కోట్ల వరల్డ్ వైడ్ కలెక్షన్లను ఈ సినిమా సొంతం చేసుకుంది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa