హీరో విశ్వంత్, సునీల్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం "కథ వెనుక కథ". కృష్ణ చైతన్య డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీజిత ఘోష్, శుభ శ్రీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి నిన్ను చూసీ చూడంగ నా కన్నే నన్ను దాటి నీవైపొస్తుందే ... అనే బ్యూటిఫుల్ మెలోడీ డ్యూయెట్ సాంగ్ లిరికల్ వీడియో విడుదలయ్యింది. ఈ పాటను శ్రీకృష్ణ, రమ్య బెహరా ఆలపించారు. పూర్ణాచారి లిరిక్స్ అందించారు.
అలీ, జయప్రకాశ్, బెనర్జీ, రఘుబాబు, సత్యం రాజేష్, మధునందన్, ఖయ్యుమ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దండమూడి అవనింద్ర కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa