విజయ్ రాజా, తమన్నా వ్యాస్ జంటగా, దర్శకుడు రామ్స్ రాథోడ్ తెరకెక్కించిన మాస్ యాక్షన్ హార్రర్ ఫ్లిక్ "వేయి శుభములు కలుగు నీకు". జనవరిలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చింది. జామి లక్ష్మి ప్రసన్న సమర్పణలో జయదుర్గా దేవి, మల్టీ మీడియా బ్యానర్ పై నరసింహ పటేల్, శ్రీనివాసరావు ఈ సినిమాను నిర్మించారు. గ్యాని సంగీతం అందించారు. ఇంతకీ ఈ సినిమాలో హీరోగా నటించిన విజయ్ రాజా ఎవరో తెలుసా.... టాలీవుడ్ నటుడు శివాజీ రాజా తనయుడు.