వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రాలలో నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నటించిన "ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి" ఒకటి. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. అదికూడా ఎలాంటి కోతలు లేకుండా. అవును. సెన్సార్ బృందం ఈ సినిమా నుండి ఎలాంటి సీన్లను కట్ చెయ్యకుండా 'యూ/ఏ' సర్టిఫికెట్ ఇచ్చిందని తెలుపుతూ మేకర్స్ అఫీషియల్ పోస్టర్ విడుదల చేసారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు.