నాచురల్ స్టార్ నాని నుండి అతి కొద్దిరోజుల్లోనే రాబోతున్న సరికొత్త చిత్రం "దసరా". శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఔటండౌట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో నాని పాన్ ఇండియా హీరోగా మారబోతున్నారు. ప్రమోషనల్ కంటెంట్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్న విషయం తెలిసిందే. మరి, బిగ్ స్క్రీన్ పై ధరణి మాస్ రేజ్ ను గావించేందుకు మరొక 20 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అప్పటి వరకు లిరికల్ సాంగ్స్, టీజర్, ట్రైలర్లతో ఎంజాయ్ చెయ్యడమే.