మాస్ రాజా రవితేజ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్న చిత్రం "రావణాసుర". సుధీర్ వర్మ దర్శకత్వంలో వినూత్న కధాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో సుశాంత్ కీరోల్ లో నటిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటివరకు రెండు లిరికల్ సాంగ్స్ విడుదల కాగా, అతి త్వరలోనే మూడవ లిరికల్ సాంగ్ యొక్క రిలీజ్ అప్డేట్ ని ఇవ్వబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. అభిషేక్ నామ, రవితేజ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.