ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చే నెల 8న 41వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బన్నీ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన "దేశముదురు" మూవీ రీ రిలీజ్ కావడానికి రెడీ అవుతుంది. మరి , ఈ మేరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రావలసి ఉంది.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ - బన్నీ కలయికలో రూపొందిన ఈ సినిమా 2007లో విడుదలై, సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతోనే గ్లామరస్ బ్యూటీ హన్సిక సినీరంగ ప్రవేశం చేసింది. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించారు. చక్రి సంగీతం అందించారు. రమాప్రభ, కోవై సరళ, ఆలీ, ప్రదీప్ రావత్, సుబ్బరాజ్, చంద్ర మోహన్, శ్రీనివాస రెడ్డి, సత్యం రాజేష్, ఆహుతి ప్రసాద్ తదితరులు ఈ సినిమాలో నటించారు.