సెన్సిబుల్ ఫిల్మ్ మేకర్ శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో యంగ్ హీరో నాగ శౌర్య 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' అనే సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో మాళవిక నాయర్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటి వరకు విడుదలైన టీజర్, పాటలు సినిమాకు డీసెంట్ బజ్ ని క్రియేట్ చేసాయి.
లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని CBFC ద్వారా U/A సర్టిఫికెట్ ని పొందినట్లు సమాచారం. ఈ చిత్రం మార్చి 17, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది.
నిర్మాత టి.జి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్లపై విశ్వప్రసాద్, పద్మజ దాసరి, వివేక్ కూచిబొట్ల ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు.