ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లియో : వచ్చే వారం విడుదల కానున్న బిగ్ సర్ప్రైస్?

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 11, 2023, 06:26 PM

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ తన తదుపరి సినిమాని తలపతి విజయ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'లియో' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. విజయ్ సరసన ఈ సినిమాలో త్రిష జోడిగా నటిస్తుంది. లియో అక్టోబర్ 19, 2023న సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది.


లేటెస్ట్  బజ్ ప్రకారం, మార్చి 14న లోకేష్ కనగరాజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గురించిన భారీ సర్ ప్రైజ్ విడుదల కానుందని కోలీవుడ్ ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ప్రియా ఆనంద్, సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, యాక్షన్ కింగ్ అర్జున్, మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్ మరియు డ్యాన్స్ మాస్టర్ శాండీ  కీలక పాత్రలలో కనిపించనున్నారు.


ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో భారీ స్థాయిలో నిర్మించనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com