ప్రముఖ ఓటిటీ నెట్ ఫ్లిక్స్ లో రీసెంట్ మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ 'ఇరాట్ట' డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి, క్రిటిక్స్ నుండి సూపర్ పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.
రోహిత్ MG కృష్ణన్ దర్శకత్వంలో థ్రిల్లర్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో జోగు జార్జ్ డ్యూయల్ రోల్ లో నటించారు. అంజలి కీలకపాత్రలో నటించారు. జోగు జార్జ్ ద్విపాత్రాభినయం సినిమాకే మెయిన్ హై లైట్ గా నిలిచింది.
తాజా సమాచారం ప్రకారం, ఇప్పుడు ఈ సినిమా తెలుగులో కూడా డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిందని తెలుస్తుంది. ఇంకా కన్నడ, తమిళ్ భాషలలో కూడా. అంటే మొత్తంగా సౌత్ లాంగ్వేజెస్ లో ఇరాట్ట మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుందన్న మాట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa