టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తమిళంలో నటించిన ఔటండౌట్ కామెడీ, హర్రర్ ఫిలిం "ఘోస్టీ". ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు చాలా సమయం తీసుకుంది. ఎట్టకేలకు ఈ నెల 17న విడుదల కాబోతుంది. కళ్యాణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో యోగి బాబు, రాధికా శరత్ కుమార్, ఊర్వశి కీరోల్స్ లో నటించారు. విశేషమేంటంటే, ఈ సినిమాలో కాజల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతుంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా 'కోస్టి' అనే టైటిల్ తో తెలుగులో మార్చి 22న విడుదల కాబోతుందని తెలుస్తుంది. ఈ మేరకు మేకర్స్ నుండి అఫీషియల్ పోస్టర్ కూడా విడుదలయ్యింది. మరి, అతి త్వరలోనే తెలుగు ట్రైలర్ కూడా విడుదల కావడానికి రెడీ అవుతుందని తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa