సెన్సషనల్ ఫిలిం డైరెక్టర్ రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రం గత కొన్ని వారాలుగా అంతర్జాతీయ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 'RRR' చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన గుర్తింపు లభించిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రంలోని 'నాటు నాటు' పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ను గెలుచుకుంది మరియు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేసింది.
'నాటు నాటు' పాటకు అకాడమీ అవార్డుల సంస్థ ఆస్కార్ అవార్డును ప్రకటించింది. ఈ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ వేదికపై ఆస్కార్ అందుకున్నారు. దీనిపై చిరంజీవి కొణిదల స్పందిస్తూ.. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న మూవీ టీమ్‌కి అభినందనలు తెలిపారు. టాలీవుడ్ మెగాస్టార్ తన అధికారిక ట్విట్టర్ లో, నాటునాటు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది అని మరియు ఉత్తమ ఒరిజినల్ పాటకి ఆస్కార్ వచ్చినందుకు చిత్ర బృందాన్ని అభినందిస్తూ పోస్ట్ చేసారు.