ఆస్కార్ 2023 అకాడమీ అవార్డుల వేదికపై నాటు నాటు పాట ప్రదర్శనకు ముందు దీపికా పదుకొణె నల్లటి గౌన్ తో (లూయిస్ విట్టన్ గౌన్) గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.తద్వారా ఆమె చాలా మంది దృష్టిని ఆకర్షించింది. దీపిక అలా నడిచొస్తున్న సమయంలో చాలా మంది ఆమెను తదేకంగా చూశారు. ఆస్కార్ వేదికపై అంత గొప్పగా కనిపించేందుకు ఆమె కఠోర సాధన చేసిందంటే నమ్మగలరా ?. నిజమే ఆస్కార్ వేదిక కోసమే దీపికా పదుకొణె చాలా ప్రత్యేక సాధన చేసింది. ఫిట్ నెస్ ఇన్ స్ట్రక్టర్ యాస్మిన్ కరాచివాలా సూచనల మేరకు ఉదయమే 6.30 గంటల నుంచి దీపికా వర్కవుట్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను యాస్మిన్ తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది . క్రమశిక్షణ, అంకిత భావం, సమతుల జీవనశైలి ఆమె అంత చక్కగా కనిపించేందుకు సాయపడినట్టు యాస్మిన్ పేర్కొన్నారు.
Deepika Padukone was made for that dress and she poured into it #Oscars pic.twitter.com/rVEEpmswbO
— sana(@dontbotheremoji) March 12, 2023
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa