మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా మూవీగా మారిన "దసరా" నుండి ఈ నెల 14న అంటే ఎల్లుండే ట్రైలర్ విడుదల కాబోతున్న విషయం తెలిసిందే కదా. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ డీటెయిల్స్ ని మేకర్స్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేసారు. ఈ మేరకు దసరా ట్రైలర్ మార్చి 14 మధ్యాహ్నం మూడున్నర గంటల నుండి కోల్కతా, లక్నో లోని ప్రతిభ థియేటర్లో లాంచ్ కాబోతుందని తెలుస్తుంది. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకుడు కాగా, నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. ఈ నెల 30న పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.