దర్శకుడు, హీరో ఆర్యన్ గౌర, మిస్తీ చక్రవర్తి జంటగా నటిస్తున్న చిత్రం 'ఓ సాథియా'. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీకి దివ్య భావన డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా, తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్ పై చందన కట్ట నిర్మిస్తున్నారు. వినోద్ కుమార్ సంగీతం దిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి బ్యూటిఫుల్ లవ్ సాంగ్ లిరికల్ వీడియో విడుదలయ్యింది. నేల మీద లేనే .. ఆ మాట నువ్వు చెప్పగానే.. అని సాగే ఈ పాటను యాజిన్ నిజార్ ఆలపించారు. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.