తమిళ్ షార్ట్ ఫిలిం "ది ఎలిఫెంట్ విస్పరర్స్" కి 95వ అకాడెమీ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో ఆస్కార్ పురస్కారం వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్రబృందానికి శుభాభినందనలు తెలియచేస్తూ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేసారు. ఇండియాకు ఫస్ట్ టైం డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో ఆస్కార్ పురస్కారాన్ని తీసుకొచ్చి మమ్మల్నందరినీ గర్వపడేలా చేసారు. ఇంకా మరిన్ని మంచి స్టోరీలు చెప్పేందుకు మీకు మరింత బలం చేకూరాలని కోరుకుంటున్నాను.. అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేసారు.