తెలుగు దర్శకుడు శివమ్ దర్శకత్వంలో బేబీ నేహా, మాస్టర్ వేదాంత్ వర్మ, బేబీ ప్రణీత రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం "లిల్లీ". ఫస్ట్ పాన్ ఇండియా చిల్డ్రన్ ఫిలింగా అతి త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతుంది. తాజాగా లిల్లీ ట్రైలర్ విడుదలయ్యింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు లిల్లీ ట్రైలర్ ని విడుదల చేసి, చిత్రబృందానికి బెస్ట్ విషెస్ తెలియచేసారు. ఈ సినిమా అంతా ఒక చిన్నపిల్ల చుట్టూ తిరుగుతుంది. ఆ పాప తన ఫ్రెండ్ ని ఎలా బతికించుకుంది? అందుకు ఏం చేసింది? అనే నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను గోపురం స్టూడియోస్ బ్యానర్ పై కే బాబు రెడ్డి, జి సతీష్ కుమార్ నిర్మించారు. యాంటో ఫ్రాన్సిస్ సంగీతం అందించారు.