కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ చిత్రం నుండి వరసగా లిరికల్ సాంగ్స్ విడుదలై, శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా రంగమార్తాండ నుండి 'పొదల పొదల గట్ల నడుమ' అనే లిరికల్ వీడియో విడుదలయ్యింది. ఈ పాటను ఆస్కార్ అవార్డు విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. ఇళయరాజా స్వరపరిచారు.
ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధానపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను కాలిపు మధు, వెంకటరెడ్డి నిర్మిస్తున్నారు.