రుద్రమదేవి తో తెరంగేట్రం చేసి, నిర్మలా కాన్వెంట్, పెళ్లి సందడి సినిమాలతో లీడ్ హీరోగా తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ ఈ రోజు 24వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రోషన్ అప్ కమింగ్ మూవీ మేకర్స్ టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి, తమ హీరోకి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేసారు. పోతే, ఈ సినిమాకు "ఛాంపియన్" అనే టైటిల్ ని మేకర్స్ ఫిక్స్ చేసారు. మే ఫస్ట్ వీక్ లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లబోతుంది.
ఈ సినిమాతో ప్రదీప్ అద్వైతం దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రదీప్ అంతకుముందు అద్వైతం అనే షార్ట్ ఫిలింని డైరెక్ట్ చేసి, నేషనల్ అవార్డు అందుకున్నారు. ఈ సినిమాను వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్త బ్యానర్లపై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.