తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య, కృతిశెట్టి జంటగా నటిస్తున్న సినిమా "కస్టడీ". ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా మే 12న తెలుగు, తమిళ భాషల్లో విడుదలయ్యేందుకు సంసిద్ధమవుతోంది.
తాజాగా కాసేపటి క్రితమే మేకర్స్ నుండి టీజర్ రిలీజ్ అప్డేట్ వచ్చింది. ఈ మేరకు మార్చి 16 సాయంత్రం 04:51 నిమిషాలకు విడుదల కాబోతుందని తెలుస్తుంది. ఈ విషయాన్ని తెలుపుతూ విడుదల చేసిన టీజర్ యొక్క టీజ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమాపై ఆసక్తిని పెంచుతుంది.