ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూట్యూబ్ ట్రెండింగ్లో 'చమ్కీల అంగీలేసి'

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 13, 2023, 07:30 PM

నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ "దసరా" నుండి ఇటీవల విడుదలైన థర్డ్ సింగిల్ 'చెమ్కీల అంగీలేసి' ఫోక్ సాంగ్ కి శ్రోతల నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తున్న విషయం తెలిసిందే. సంతోష్ నారాయణ్ స్వరపరిచిన ఈ గీతాన్ని ఒక్కో భాషల్లో ఒక్కో స్టార్ సింగర్ ఆలపించారు. తెలుగులో ధీ, రామ్ మిరియాల ఆలపించగా, కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. ఇప్పుడు ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లో చూసిన చమ్కీల అంగీలేసి రీల్సే కనిపిస్తున్నాయి. పాన్ ఇండియా భాషల్లో అదరగొడుతున్న ఈ సాంగ్ యూట్యూబ్ ఇండియా టాప్ 20 ట్రెండింగ్ సాంగ్స్ లో నెంబర్ వన్ పొజిషన్లో దూసుకుపోతుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈనెల 30న విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com