'జార్జి రెడ్డి' ఫేమ్ నవీన్ బేతిగంటి హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం "రామన్న యూత్". ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఫైర్ ఫ్లై ఆర్ట్స్ పతాకంపై రజిని నిర్మిస్తున్న ఈ చిత్రానికి కమ్రాన్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం నుండి మేకర్స్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు. ఆస్కార్ అవార్డు విన్నర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన 'ఓ సుందరి' అనే పాటను మార్చి 17న విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.