నటసింహం నందమూరి బాలకృష్ణ గారి డిజిటల్ టాక్ షో "అన్స్టాపబుల్ విత్ NBK" కి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజల నుండి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ ఐన ఈ షో యొక్క రెండు సీజన్లు కూడా అదిరిపోయే రేటింగ్స్ తో స్ట్రీమింగ్ అయ్యాయి.
మరోసారి బాలయ్య ఆహాలో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆహాలో ఈమధ్యనే ప్రారంభమైన తెలుగు ఇండియన్ ఐడల్ 2 కి బాలకృష్ణ గారు గెస్ట్ గా హాజరై, కంటెస్టెంట్లకు శుభాభినందనలు తెలియచేయనున్నారు. ఈ ఎపిసోడ్ మార్చి 17, 18 తేదీలలో స్ట్రీమింగ్ కి రాబోతుంది.
తాజాగా ఈ ఎపిసోడ్ లో నెవర్ సీన్ బిఫోర్ అవతార్ లో పాల్గొన్న బాలయ్య పిక్స్ ని ఆహా సంస్థ విడుదల చేసింది. ఈ పిక్స్ లో బ్లాక్ కలర్ ట్రెండీ ఔట్ ఫిట్ లో బాలయ్య సూపర్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు.