మోస్ట్ ఎవైటెడ్ కాంబో త్రివిక్రం - మహేష్ బాబు కలయికలో "SSMB 28" రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ సినిమాపై ఆడియన్స్ లో ఐతే, భారీ అంచనాలే ఉన్నాయి.
సోషల్ మీడియాలో నడుస్తున్న వైరల్ బజ్ ప్రకారం, ఈ సినిమాకు మేకర్స్ మూడు విభిన్న టైటిల్స్ ని పరిశీలిస్తున్నారని, అవి.. అర్జునుడు, అతడే సీక్వెల్, అమ్మ కథ ...అని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. మరి, వీటిలోనే ఒకటి ఫైనలైజ్ అవుతుందా? లేక సరికొత్త టైటిల్ తో ఆడియన్స్ ని మేకర్స్ సర్ప్రైజ్ చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.
ఉగాది కానుకగా SSMB 28 టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ విడుదల చేస్తారని కూడా మరో ప్రచారం కూడా ఊపందుకుంటుంది. మరి, ఇందుకు సంబంధించి ఇప్పటివరకైతే, ఎలాంటి అఫీషియల్ న్యూస్ లేదు. ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది.