మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న "RC15" మూవీపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఆస్కార్ అవార్డుతో గ్లోబల్ లెవెల్ క్రేజ్ సొంతం చేసుకున్న చరణ్ నుండి రాబోతున్న ఈ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ యొక్క టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ మార్చి 27న రాబోతుంది.
లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ గారు ఒక ప్రత్యేక పాత్రలో నటించబోతున్నారని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో కోలీవుడ్ విలక్షణ నటుడు SJ సూర్య నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. విలక్షణ నటుల సంఖ్య పెరుగుతుండే సరికి అంచనాలు కూడా తారాతీరాన్ని చేరుతున్నాయి. ఐతే, మరి, RC 15 లో అనిల్ నటిస్తున్నారన్న విషయంపై ఇప్పటివరకైతే ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు కానీ, ఈ న్యూస్ తో ఐతే, మెగా అభిమానుల్లో ఉన్న ఖుషి రెట్టింపు అవుతుందని తెలుస్తుంది.
ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు.