మోస్ట్ హ్యాపెనింగ్ కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ రోజు 37వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. దీంతో ఈ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ కి చిత్ర నిర్మాణ సంస్థలు, సెలెబ్రిటీలు, ప్రేక్షకాభిమానులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేస్తున్నారు.
సినిమాల్లోకి రాకముందు లోకేష్ బ్యాంకు ఉద్యోగిగా పనిచేసారు. కార్పొరేట్ షార్ట్ ఫిలిం కాంపిటీషన్లలో తరచుగా పాల్గొనే లోకేష్ ని డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ సినిమాల్లోకి ఆహ్వానించారు. 2016లో 'అవియల్' అనే యాంథాలజీ ఫిలిం ద్వారా లోకేష్ కోలీవుడ్ చిత్రపరిశ్రమకు పరిచయమయ్యారు. ఆపై సందీప్ కిషన్ తో 'మా నగరం', కార్తీ తో 'ఖైదీ', విజయ్ తో 'మాస్టర్', కమల్ హాసన్ తో 'విక్రమ్' చిత్రాలను తెరకెక్కించి, బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ప్రస్తుతం విజయ్ తో రెండో చిత్రం "లియో" తెరకెక్కిస్తున్నారు.