KGF తో పాన్ ఇండియా సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ కలయికలో రూపొందుతున్న చిత్రం "సలార్". ఇద్దరు పాన్ ఇండియా స్టార్ల కలయికలో రూపొందుతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే.
డెబ్బైశాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అతి త్వరలోనే చిత్రీకరణను ముగించుకోబోతుంది. ఈ నేపథ్యంలో మరి వేసవి నుండి న్యూ పోస్టర్లు, టీజర్, లిరికల్ సాంగ్స్ ... ట్రైలర్.. ఇలా ఒక్కోటి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్లాన్ చేస్తుందట. సెప్టెంబర్ 28వ తేదీ నుండి ప్రపంచవ్యాప్తంగా సలార్ మ్యానియా మొదలుకాబోతుంది.