నాచురల్ స్టార్ నాని ఊరమాస్ అవతారం, గూజ్ బంప్స్ కలిగించే యాక్షన్ సీక్వెన్సెస్, శ్రోతలను ఉర్రూతలూగిస్తున్న లిరికల్ సాంగ్స్... తో "దసరా" పాన్ ఇండియా మూవీ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి, ఈ సినిమా విడుదలకు ఇంకా ఎన్ని రోజులో సమయం లేదు కాబట్టి.. మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసారు. ఈ మేరకు ఈ రోజు మధ్యాహ్నం 3:33 నిమిషాల నుండి లక్నోలోని ప్రతిభ థియేటర్లో దసరా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగబోతుంది. టీజర్ తో సెన్సేషన్ సృష్టించిన దసరా.. ట్రైలర్ తో అంచనాలను ఎంతవరకు నిలబెట్టుకుంటుందో చూడాలి.
శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకుడు కాగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ నెల 30న పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.