మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన "భోళా శంకర్" లో తప్పించి మరే బిగ్ సినిమాలో నటించట్లేదు. చెప్పాలంటే, తెలుగులో ఇదివరకు బిజీగా ఉన్నట్టు ఇప్పుడు తమన్నా లేదు. ఇప్పుడు ఆమె చూపంతా బాలీవుడ్ పైనే ఉంది. అక్కడ వెబ్ సిరీస్ లు, వెబ్ ఫిలిమ్స్ చేస్తూ కాలం గడుపుతుంది.
ఐతే, ఈ ఏడాది మొదటి నుండి కూడా తమన్నా రిలేషన్ షిప్ లో ఉందని, అతి త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుందని ముమ్మర ప్రచారం జరుగుతుంది. మరి, తమన్నా మనసు దోచుకున్నదెవరంటే.. విజయ్ వర్మ. తెలుగులో ఇతను నాని "MCA" లో విలన్గా నటించారు. గల్లీ బాయ్, పింక్, మీర్జాపూర్ లతో స్టార్ స్టేటస్ అందుకున్నాడు.
తాజాగా విజయ్ వర్మతో రిలేషన్ పై తమన్నా స్పందించింది. కానీ, అతనితో రిలేషన్ లో లేను అని కానీ.. ఉన్నాను అని కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఆమె మాట్లాడుతూ.. డాక్టర్ నుండి బిజినెస్ మ్యాన్ వరకు.. ఎవరో ఒకరితో ప్రతి శుక్రవారం నా పెళ్లిని జరిపిస్తూనే ఉన్నారు. నాకు తెలిసి నాకు ఇప్పటికే చాలాసార్లు పెళ్లి అయిపోయింది. మరి, నిజంగా నా పెళ్లి జరిగినప్పుడు జనాలు ఏమైపోతారో? వాళ్లలో అసలు ఎక్జయిట్మెంట్ ఉంటుందా?...లేకుంటే.. ఇది కూడా ఒకరకమైన పుకారని అనుకుంటారా? అంటూ తమన్నా వాపోయింది.