విశ్వనటుడు కమల్ హాసన్, మూవీ మావెరిక్ శంకర్ల కలయికలో "ఇండియన్" సీక్వెల్ రూపొందుతుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్ కీరోల్స్ లో నటిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
చాలాకాలం అటకెక్కి కూర్చున్న ఈ సినిమా గతేడాది చివర్లో పునఃప్రారంభమై శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తమిళనాడులోని కల్పక్కం డచ్ చర్చి లో జరుగుతుంది. కమల్ మరియు మరికొందరిపై మేకర్స్ కీ యాక్షన్ సీక్వెన్సెస్ ని చిత్రీకరిస్తున్నారని తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa